Gopichand : సింగం దర్శకుడితో గోపీచంద్… ఇన్నాళ్లకు గోపీచంద్ కు కరెక్ట్ డైరెక్టర్ తగిలాడా….!

Gopichand: తొలి వలపు సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టినాడు గోపీచంద్.తరువాత వచ్చిన జైసం, నిజం వంటి సినిమాల్లో విలెన్ గా కూడా ఆధారగొట్టాడు. మళ్ళీ రూటు మార్చి హీరో గా మాస్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఇప్పటి దాకా గోపీచంద్ కు సరైన సినిమా పడలేదంటే అతిషయోక్తి లేదు.మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.అప్పుడప్పుడు సినిమాలలో కొన్ని ప్రయిగాలు కూడా చేస్తున్న చివరకు తిరిగి యాక్షన్ డ్రామా ల రూట్ లో కె వస్తుంటాడు.

ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.ఈ సినిమా పైనే గోపీచంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలారోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ మారుతీ సినిమా మీద నమ్మకంతో వున్నాడు.ఈ సినిమా తరువాత గోపీచంద్ చేసే సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయ్. అదేంటంటే ఓ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ తో సినిమా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.గిపీచంద్ కోసం ఒక యాక్షన్ కథ ను ఆ డైరెక్టర్ రెడీ చేసినట్టు సమాచారం.

ఆ డైరెక్టర్ ఎవరో కాదు సూర్య హీరో గా సింగం సిరీస్ తీసిన డైరెక్టర్ హరి. సౌత్ సినిమా పరిశ్రమలో సింగం సీరీస్ కు ఎంతటి స్థాయి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హరి తన తదుపరి సినిమా గోపీచంద్ తో చేసే విధంగా ప్లాన్ చేశాడు. ఆ విధంగా వీరి కాంబో లో ఈ సినిమా రావడం నిజంగా తెలుగు ప్రేక్షకులను సరికొత్త ఫీలింగ్ ను కలిగిస్తుంది అని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం వహించిన వేరే సినిమాలు కూడా ఆయనను టాప్ పొజిషన్ లో నిలబెట్టాయి.అలా ఆయన సినిమాల్లో కేవలం యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. గోపీచంద్ లాంటి యాక్షన్ హీరో కి ఈ యాక్షన్ డైరెక్టర్ తోడైతే తప్పకుండా వారి నుంచి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి వీరి యాక్షన్ కాంబినేషన్ గోపీచంద్ అభిమానులు ఎదురుచూస్తున్న హిట్ ఇస్తుందో లేదో చూడాలి.