మరో ఫ్లాప్ డైరెక్టర్ తో గోపిచంద్

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్. మ్యాచో స్టార్ అనే బ్రాండ్ తో యాక్షన్ హీరోగా తనదైన ముద్రను వేసుకున్నారు. కెరియర్ లో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా కూడా కమర్షియల్ హీరోగా తనకంటూ మార్కెట్ గోపీచంద్ క్రియేట్ చేసుకున్నారు.

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాపై గోపిచంద్ చాలా నమ్మకంగా ఉన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో లక్ష్యం, లౌక్యం సినిమాలతో ఇప్పటికే గోపీచంద్ రెండు హిట్స్ ని సొంతం చేసుకున్నారు. రామబాణం మూవీతో హ్యాట్రిక్ నమోదు చేయాలని ఇద్దరూ భావిస్తున్నారు.

దానికి తగ్గట్టుగానే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమాని ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ చేయబోయే ప్రాజెక్టుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కన్నడ స్టార్ దర్శకుడు ఏ హర్షతో నెక్స్ట్ మూవీ ఉండబోతుంది.

దీంతో పాటు ప్రస్తుతం ఫెయిల్యూర్ తో ఉన్న ఫీడ్ అవుట్ దర్శకుడు శ్రీనువైట్ల డైరెక్షన్ లో గోపీచంద్ ఒక సినిమా చేయబోతున్నారంట. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే తేజ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా సరైన సక్సెస్ లేక వెనుకబడి పోయారు. ఇప్పుడు గోపీచంద్ ఇద్దరికి అవకాశం ఇవ్వడం విశేషం.

హర్షతో తో చేయబోతున్న ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శ్రీనువైట్ల, తేజ లతో మూవీస్ ఉంటాయని గోపీచంద్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి టాలీవుడ్ లో ఫ్లాప్ దర్శకులకు కేరాఫ్ గా ఇప్పుడు గోపీచంద్ మారిపోయాడనే మాట వినిపిస్తోంది. గతంలో గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు అలాగే శీను వైట్లకు కూడా అవకాశం ఇస్తూ ఉండటం విశేషం.