క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఏదయినా ఇండస్ట్రీలో ఒక క్రేజ్ వచ్చే వరకే ఒకసారి అది వచ్చిందా ఆపడం ఎవరితరం కాదు. అదే ఊపు మీద ఉన్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించడం లో గోపీచంద్ తనకంటు ఒక మార్క్ ను సెట్ చేసుకున్నాడు. డాన్ శీను, బలుపు , పండగ చేసుకో వంట బ్లాక్ బస్టర్లను అందించిన ఈ యువ దర్శకుడు.. లేటెస్ట్ గా క్రాక్ మూవీతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు.
అసలే కరోనా తో కొట్టుమిట్టాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు డేర్ చేసి థియేటర్ లలో సినిమా ను రిలీజ్ చేసి ఊపిరి పీల్చుకునేలా చేసాడు. ఇక మాస్ మహారాజ రవితేజ తో చేసిన ఈ మూవీ తో కమర్షియల్ డైరెక్టర్ గా మరో లెవల్ కి చేరుకున్నాడు గోపీచంద్ మలినెని. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సై అంటున్నారని టాక్. పక్కా మాస్ సినిమాలు చేయాలనుకునే వారంతా ఇప్పుడు గోపీచంద్ మలినేని వైపే చేస్తున్నారట. ఇక టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని కంబినేషన్ లో నటించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
అసలే మాస్ సినిమాలతో దుమ్ము దులిపే బాలయ్య.. గోపీచంద్ మలినేని తో జతకడితే ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్ లో ఉంటుందోనని ఫిలిం నగర్ లో చర్చలు మొదలయ్యాయి. ఇక బాలయ్యకు కూడా మాస్ పల్స్ తెలిసిన దర్శకులను ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను తో చేస్తున్న తాజా సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. త్వరలో ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత రెండు సినిమాలను లైన్ లో లో పెట్టారట బాలయ్య. ఈ రెండు సినిమాలు కూడా యంగ్ డైరెక్టర్స్ వి కావడం విశేషం. అందులో ఒక మూవీ గోపీచంద్ మలినెని దే అని టాక్.