మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేకత ఉంది. ఏదైనా మంచి సినిమా వచ్చిందని తెలిసినా, అందరినీ ఆకట్టుకునే సినిమా వచ్చిందని తెలిసినా కూడా వెంటనే ప్రశంసిస్తాడు. సినిమా దర్శక నిర్మాతలు, హీరోలను అభినందిస్తుంటాడు. అలా చిరు అభినందించడంతో వారిలో ఎక్కడా లేని ఉత్సాహం, ఆనందం కలుగుతూ ఉంటుంది.తాజాగా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా అదే మూడ్‌లో ఉన్నాడట. సంక్రాంతి బరిలో నిలిచిన క్రాక్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
విడుదల రోజు ఎన్ని సమస్యలు వచ్చినా, షోలు రద్దైనా కూడా, నాటి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మొదటి రోజు కొన్ని చోట్లు మూడు షోలు రద్దై కేవలం ఒకే షో పడింది. కొన్ని చోట్ల రెండు షోలు మాత్రమే పడ్డాయి. మొదటి రోజు ఎలా ఉన్నా కూడా క్రాక్ మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఇప్పటికీ థియేటర్ల వద్ద జనాలు సందడి చేస్తున్నారు. మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ ఇలా ఎన్ని చిత్రాలున్నా కూడా క్రాక్ సినిమా థియేటర్లలోనే సందడి కనిపిస్తోంది.
అలా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలన్నింటిలో కెల్లా అత్యధిక లాభాలను ఆర్జిస్తోంది. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన క్రాక్‌పై చిరు ప్రశంసలు కురిపించాడు. దర్శకుడు గోపీచంద్ మలినేనిని చిరు ప్రత్యేకంగా ప్రశంసించాడట. ఫోన్ చేసి మాట్లాడుతూ.. సినిమా గురించి కథ కథనం టేకింగ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడట. చిరు మాటలు, ప్రశంసలు విన్నాక ఆకాశంలో తేలినట్టు, చంద్రునిపై కాలు పెట్టినట్టు దర్శకుడు ఫీలయ్యాడట.