టాలీవుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2. ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎవరి నోటి నుంచి విన్నా పుష్ప గురించిన సంభాషణే జరుగుతుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల కిస్సిక్ అనే ఐటమ్ సాంగ్ చేసింది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ ని ఆదివారం రాత్రి 7:02 గంటలకి చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
ఈ సినిమా కోసం సామాన్య ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారు సినీ దిగ్గజాలు కూడా అంతగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక ఈ సినిమా పై ప్రముఖ కధా రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. పుష్ప పేరు చిన్నదే కానీ సాధించిన సక్సెస్ చాలా పెద్దది, పెద్ద పేరు పెట్టి తీస్తేనే ప్రేక్షకులు చూస్తారు అని రూలేమీ లేదని చెప్పుకొచ్చారు.
పుష్ప మొదటి భాగంతో పోల్చి చూసినట్లయితే పార్ట్ 2 లో పుష్ప రాజసం ఉట్టిపడుతుందని, శ్రీవల్లి నా పెళ్ళాం.. పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో పెపంచానికి చూపిస్తాను అనే డైలాగ్ ప్రేక్షకులని కట్టిపడేసిందని, కలప దొంగ హెలికాప్టర్ దిగే షాట్ తో నేరస్తులు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది చూపించారు. నాది కానిది ముట్టుకోను, నాది వదులుకోను అని పుష్ప అనడం పట్ల అతడి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది.
పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్నేషనల్ అనే మాటతో పుష్ప 1 ఏ రేంజ్ కి వెళ్ళింది గుర్తు చేశారు, పుష్ప 2 సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు పరుచూరి గోపాలకృష్ణ. గోపాలకృష్ణ గారి అభిప్రాయాన్ని చూస్తుంటే సామాన్యులే కాకుండా సినీ దిగ్గజాలు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాయో అర్థమవుతుంది మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందన్నది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.