బిగ్‌బాస్ షోలో ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.. ఏది చేసినా అన్ని రకాలుగా ఆలోచించి చేయాలి. మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. అలా మాటలు తూలే కొందరు ఎలిమినేట్ అయ్యారు.భాను శ్రీ, తేజస్వీ, దీప్తి సునయన, తమన్నా సింహాద్రి, హేమ ఇలా ఎంతో మంది మాటల వల్లే ఎలిమినేట్ అయ్యారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అమ్మ రాజశేఖర్‌పై లాస్య చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.
హౌస్‌మేట్స్ అందరూ సింపతీ, సేఫ్ గేమ్ ఆడుతున్నారని నాగార్జున ఫైర్ అయ్యాడు. అందరి గుట్టు రట్టుచేసేందుకు హీరో, జీరో టాస్క్ ఇచ్చాడు. ప్రతీ కంటెస్టెంట్ తమ దృష్టిలో హీరో ఎవరు జీరో ఎవరు చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. అలా ఎందుకు చెప్పారో కూడా కారణాలు తెలపాలన్నాడు. అందరూ తమ తమ దృష్టిలో హీరోలు, జీరోలుగా ఉన్నవారిని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే లాస్య తప్పటడుగు వేసింది..
లాస్య తన దృష్టిలో అమ్మ రాజశేఖర్‌ను జీరో అని పేర్కొంది. శృతి మించిన కామెడీ తాను ఒప్పుకోలేనని, స్కిట్‌లో భాగంగా దివి ప్రెగ్నెన్సీ కుషన్స్ ఆయనే పెట్టడం తనకు నచ్చలేదని తెలిపింది. ఈ ఆరోపణలతో మాస్టర్ ఎమోషనల్ అవ్వడం, దివి రివర్స్ అటాక్ అవ్వడం.. ప్రేక్షకుల దృష్టిలో లాస్య నిందితురాలిగా మిగిలిపోయింది. ఇక ఇదే విషయంపై గీతా మాధురి స్పందించింది. లోపల ఉన్నప్పుడు కొన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కంటెస్టెంట్స్.. ఇమేజ్ డ్యామేజ్ చాలా వేరేలా ఉంటుంది.. కంటెస్టెంట్సే అన్నారు అంటే అక్కడ ఏదో అయ్యుంటుంది అనుకుంటారు అని కౌంటర్ వేసింది. అయితే మళ్లీ ఈ పోస్ట్‌ను గీతా మాధురి డిలీట్ చేసేసింది. అలా ఎందుకు చేసిందో మరి.