శరవేగంగా ‘గేమ్‌ఛేంజర్‌’ నిర్మాణం.. మార్చి 27న రానున్న అప్‌డేట్‌!

స్టార్స్‌ బర్త్‌డే వేడుకలు అంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. అదే రోజు అభిమానులకు తమ చిత్రాల అప్‌డేట్‌లతో ట్రీట్‌ ఇస్తుంటారు స్టార్‌ హీరోలు. ప్రచార చిత్రాలు, ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌, సింగిల్స్‌ పేరుతో రకరకాల అప్‌డేట్స్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటారు. మార్చి నెలలో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాలకు సంబంధించి హంగామా షురూ కానుంది.

మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి తాజా అప్‌డేట్‌ రానుందని తెలుస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దసరా లేదా దీపావళి పండుగల సమయంలో విడుదల చేసే అవకాశం ఉందని నెట్టింట వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అది ఎప్పుడనే విషయంపై చరణ్‌ పుట్టినరోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి సంబంధించి పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గేమ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌ కానుందని, ‘ఇందులో రామ్‌చరణ్‌ మాస్‌, క్లాస్‌, రగ్డ్‌, అఫీషియల్‌ ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాలుగా ఉండగలడో అన్ని రకాలుగా ఈ చిత్రంలో కనిపిస్తాడు’ అని రచయిత సాయి మాధవ్‌ బుర్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో క్లిప్‌ ట్రెండ్‌ అవుతోంది. మరో నటి కారుణ్య ‘గేమ్‌ ఛేంజర్‌’ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుందని తెలిపారు.

ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్‌ డ్రామాకి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం రామ్‌చరణ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

కాగా కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జె సూర్య, నవీన్‌ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ తన కెరీర్‌ లోనే బెస్ట్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’? పాటకి ఆస్కార్‌ వచ్చిన తర్వాత, రామ్‌ చరణ్‌ తేజ్‌ ఇమేజ్‌ గ్లోబల్‌ రేంజ్‌ కి వెళ్ళింది. అందుకే శంకర్‌ కూడా చరణ్‌ సినిమాని ఆ రేంజ్‌లోనే ప్లాన్‌ చేశాడు. మొత్తానికి భారీ బ్జడెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బరువైన ఎమోషన్స్‌ తో పాటు గ్రాండ్‌ విజువల్స్‌ కూడా ఉండబోతున్నాయి.