Game changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వరుసగా ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలే ఉన్నాయి కానీ గత పది సంవత్సరాలుగా శంకర్ అనుకున్న స్థాయిలో ఏ సినిమా ద్వారా సక్సెస్ అందుకోలేకపోయారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే సందేహాలు కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ఇక ఈ సినిమా కొత్త ఏడాదిలో భారీ బడ్జెట్ సినిమా కావటం విశేషం. ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా 500 కోట్ల రూపాయల ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఇలా భారీ బడ్జెట్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం సక్సెస్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను రాబడుతుందా అన్న సందేహం కూడా మరోవైపు కలుగుతుంది. రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంటే పర్లేదు కానీ ఏమాత్రం తేడా కొట్టిన ఇటు రాంచరణ్ కెరియర్ కు అటు దిల్ రాజుకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు తప్పవనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.