అఫీషియల్ : “గేమ్ చేంజర్” లీక్..ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించే భారీ చిత్రం “గేమ్ చేంజర్” నిన్న రాత్రి నుంచి అయితే టాలీవుడ్ సినిమా సహా టాలీవుడ్ మూవీ లవర్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వినిపిస్తుంది. అయితే ఇదంతా ఈ సినిమా నుంచే సాంగ్ లీక్ అయ్యింది అని స్టార్ట్ అయ్యింది.

నిజానికి స్టార్ట్ అవ్వడం గేమ్ చేంజర్ సాంగ్ అనే వచ్చింది. కానీ ఇదే గేమ్ చేంజర్ లో సాంగ్ అని ఇప్పటివరకు అయితే ఆధారాలు లేవు. కాగా ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సాంగ్ చాలా మందికి నచ్చేసింది కానీ మెల్లగా అసలు ఇది శంకర్ రామ్ చరణ్ ల సినిమాలో సాంగ్ నే ఎందుకు అయ్యి ఉండాలి?

వేరే సినిమా లోనిది కూడా అయ్యి ఉండొచ్చు కదా అని చాలా మంది థింకింగ్ స్టార్ట్ చేసారు. మరి లాజికల్ గా ఇది కూడా కరెక్ట్ అనే చెప్పాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా ఈ లీక్ విషయంలో చిత్ర యూనిట్ కానీ సాంగ్ సంగీత దర్శకుడు థమన్ లు కానీ ఇంకా ఇప్పటివరకు ఎలాంటి స్పందన అందించలేదు దానిని సర్క్యులేట్ చేయొద్దని ప్రెస్ నోట్ లాంటిది కూడా రిలీజ్ చేయలేదు.

దీనితో ఇది అసలు గేమ్ చేంజర్ సినిమా నుంచి లీక్ అయ్యిన పాటేనా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ సరిగ్గా ఈ సమయంలోనే చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ అందించారు. సాంగ్ సినిమాలోనిదే అని కన్ఫర్మ్ చేసి ఆ సాంగ్ ని లీక్ చేసినందుకు గాను కేసు ఫైల్ చేసినట్టుగా ఎఫ్ ఐ ఆర్ తాలూకా కాపీని రిలీజ్ చేశారు. 

దీనితో గేమ్ చేంజర్ విషయంలో ఓ ఊహించని ట్విస్ట్ గా మారింది అని చెప్పాలి. కాగా ఇప్పుడు ఆ సాంగ్ ని సర్క్యులేట్ చేసిన కూడా అది ఇల్లీగల్ గానే అవుతుంది అని అందరిని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం సాంగ్ అయితే ఈ సినిమాలోనిదే అని చెప్పకనే చెప్పేసారు. ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి మరో హీరోయిన్ గా నటించింది.