గేమ్ ఛేంజర్.. వచ్చేది అప్పుడేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు సినిమా షూటింగ్ కూడా ఎంతవరకు వచ్చింది అన్న విషయంపై కూడా అప్డేట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. మెగా అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా హీరోయిన్ కీయారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక లుక్కు కూడా విడుదల చేయకుండా ఏదో నామమాత్రంగా విషెస్ అయితే చెప్పేసారు. అసలు ఈ సినిమా 2024 సంక్రాంతికి రావాల్సింది. కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2తో బిజీగా ఉండడం వలన అది కాస్త వాయిదా పడింది. ఇక ఇప్పుడు నిర్మాత దిల్ రాజు అయితే మరొక కొత్త ప్రణాళికతో శంకర్ కు టార్గెట్ ఫిట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 మార్చి రెండవ వారం లేదా మూడో వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక శంకర్ ఇండియన్ 2 సినిమాను దాదాపు పూర్తి చేశాడు. అది వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా ను ఆ తర్వాత మార్చి నెలలో రెండవ వారం విడుదల చేయాలి అని శంకర్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక త్వరలోనే ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తయిన అనంతరం విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా SJ.సూర్య శ్రీకాంత్, అంజలి కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాది చివరలో స్టార్ట్ కానుంది.