Game changer: గేమ్ ఛేంజర్ పెద్ద టార్చర్… ఫస్ట్ రివ్యూ ఇచ్చిన బాలీవుడ్ క్రిటిక్!

Game changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పాటలు కనుక చూస్తే సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఈ సినిమా మరొక మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ విడుదల చేశారు.

బాలీవుడ్ క్రిటిక్ గా పేరుపొందిన ఉమైర్ సందు తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ రాంచరణ్ శంకర్ కాంబినేషన్లో అత్యంత బలహీనమైన సినిమాగా గేమ్ ఛేంజర్ ఉండబోతుందని తెలిపారు. బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా పేలవంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు.

ఇక ఈ సినిమాలో నటీనటుల నటన కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇదొక టార్చర్ అంటూ ఈయన ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ సినిమా గురించి ఈయన ఇలాంటి నెగిటివ్ రివ్యూ ఇవ్వటం పట్ల మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈయన ఏ సినిమా గురించి అయినా నెగిటివ్ రివ్యూ ఇస్తే కనుక ఆ సినిమా కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందని ఇలాంటి నెగటివ్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేయగా మరికొందరు సినిమా గురించి విడుదల కాకుండానే ఇలా నెగిటివ్ ప్రచారాలు చేస్తూ సినిమాకు నష్టం తీసుకువచ్చే ఇలాంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి టాక్, ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.