‘గేమ్ ఛేంజర్’.! శంకర్ వేరే ఆలోచన చేశాడా.?

సాధారణంగా దర్శకుడు శంకర్ సినిమా టైటిల్ అనగానే.. ఒకింత ప్రత్యేకంగా వుంటాయ్. ‘గేమ్ ఛేంజర్’ కూడా ప్రత్యేకంగానే వుందా.? అంటే, పరమ రొటీన్.. అన్న చర్చ అయితే జరుగుతోంది. మరి, ఎక్కడ తేడా జరిగినట్టు.? శంకర్ అయిష్టంగానే ‘గేమ్ ఛేంజర్’ టైటిల్‌కి ఓకే చెప్పాడా.? గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చాక, రామ్ చరణ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత దిల్ రాజు, శంకర్‌కి ఇష్టం లేకపోయినా.. ఆ టైటిల్ ఖరారు చేశాడా.?

ఇవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ లుక్ విషయంలోనూ శంకర్ అభిమానులు ఒకింత హర్ట్ అవుతున్నారు. సినిమాలో చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. అందులో ఓల్డ్ గెటప్ ఒకటి. దాన్ని రివీల్ చేసి వుంటే బావుండేదన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.

రామ్ చరణ్ అభిమానులు కూడా, ‘బ్రూస్‌లీ’ సినిమా తరహా స్టిల్ తప్ప, ‘గేమ్ ఛేంజర్’ లుక్ అయితే అంత బాలేదనే అంటున్నారు.