Gaali Vaana WebSeries : ట్విస్ట్ లతో ఆకట్టుకోనున్న గాలివాన వెబ్ సిరీస్.. నేటి నుంచి స్ట్రీమింగ్..!

 

Gaali Vaana WebSeries : ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అన్న తేడా లేకుండా వెబ్ సిరీస్ ల హావ నడుస్తోంది.టాప్ హీరోలు హీరోయిన్ లు కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.అన్ని ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ వెబ్ సిరీస్ లను ఎంకరేజ్ చేస్తున్నాయి.ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఐనా సమంత కూడా హిందీ లో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక నాగచైతన్య కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జీ 5 ఓటీటీ గాలివాన అనే వెబ్ సిరీస్ ను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచే స్టీమింగ్ అవ్వబోతోంది.గాలివాన’ సిరీస్ లో రాధికా శరత్ కుమార్ ఇంకా డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇప్పటికే వచ్చిన టీజర్ ఇంకా ట్రైలర్ లతో గాలి వాన వెబ్ సిరీస్ బాగా ఆకట్టుకుంది.ఈ వెబ్ సిరీస్ లోని ట్విస్టులు అదిరిపోయాయి అని అంటున్నారు. ఒక కొత్తగా పెళ్లి ఐన జంట హనీమూన్ కోసం వెళ్లి హత్య కి గురి అయిన నేపథ్యం తో ఈ వెబ్ సిరీస్ తీసారు.

ఈ మర్డర్ హిస్టరీ ని చేదించే సమయం లో ఎదుర్కొన్న సవాళ్లు, ఇంకా వారి కుటుంబ సభ్యులు ప్రతికారం ఎలా తీర్చుకున్నారో, నిందితులు ఎవరు అన్న విషయం తెలుసుకోవాలి అంతే గాలివాన చూడాల్సిందే అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ను కిరాక్ పార్టీ’ ‘తిమ్మరుసు’ సినిమాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ”గాలివాన” వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు.ఈ వెబ్ సిరీస్ లో చాందినీ చౌదరి – చైతన్య కృష్ణ – అశ్రిత వేముగంటి – నందిని రాయ్ – తాగుబోతు రమేశ్ – శరణ్య ప్రదీప్ – అర్మాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.