బాలయ్యను వదలని ఒకప్పటి స్టార్ డైరెక్టర్?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు సీతార ఎంటర్టైన్మెంట్స్ లో బాబీ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే బాలకృష్ణ సీనియర్ దర్శకులతో కొంతమందికి మళ్లీ అవకాశాలు ఇచ్చేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు.

అందులో వివి వినాయక్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పటివరకు వినాయక్ సరైన కథ అయితే సెట్ చేసుకోలేదు. గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి బాలయ్య కు నచ్చలేదు. దీంతో వినాయక్ ఇప్పుడు బాలయ్య తో కూడా సినిమా చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుస్తోంది.

అయితే మరోవైపు ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా ఒక సీనియర్ దర్శకుడు మాత్రం బాలయ్య వెంటే తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు బి గోపాల్ అని టాక్ వినిపిస్తోంది. ఈ సీనియర్ దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంద్ర నరసింహా నాయుడు వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ గతంలో బిగోపాల్ కు చాలాసార్లు కొన్ని ఆఫర్లు అయితే ఇచ్చాడు.

ముఖ్యంగా కొంతమంది ప్రముఖ రచయితలతో కలిసి కథలు కూడా విన్నారు. కానీ ఏది కూడా బాలయ్య బాబుకు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా బాలయ్య బాబుతో తరచుగా బి గోపాల్ చర్చలు జరుపుతున్నట్లుగానే తెలుస్తోంది. ఇక బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమాకు రెడీ అవుతున్న బాలయ్య బాబు మరో మూడు నెలలపాటు బి.గోపాల్ కు సమయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ లోపు మంచి కథ సెట్ చేసుకుంటే తర్వాత సినిమా మీతోనే చేస్తాను అని మాట కూడా ఇచ్చారట. మరి ఆయన అంచనాలకు తగ్గట్టుగా గోపాల్ మంచి కథతో వస్తారో లేదో చూడాలి.