హీరో తరుణ్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం.!

‘నువ్వే కావాలి సినిమా’తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో తరుణ్. అప్పట్లో తరుణ్ అంటే ఓ సంచలనం. అమ్మాయిల గుండెల్లో బాయ్ ఫ్రెండ్‌లా చాక్లెట్ బోయ్‌లా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.

అంతకు ముందే బాల నటుడిగా తరుణ్ సుపరిచితుడు. బాలనటుడిగా వున్నప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక, ‘నువ్వే కావాలి’ సినిమాతో ఆల్ టైమ్ రికార్డులు కొల్లగొట్టేసి స్టార్ హీరో అనిపించుకున్నాడు.

అయితే, ఆ స్టార్‌డమ్ ఎంతో కాలం నిలవలేదు తరుణ్ విషయంలో. అంతలా స్టార్‌డమ్ అయితే దక్కించుకున్నాడు కానీ, స్టార్ హీరో అనిపించుకోలేకపోయాడు ఇప్పటి వరకూ.

ఒకానొక టైమ్‌లో కెరీర్ డౌన్ ఫాల్ అయ్యి ఇండస్ర్టీ నుంచి తప్పుకోవల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది తరుణ్‌కి. అందుకు కారణం దివంగత నటి ఆర్తీ అగర్వాల్‌తో ప్రేమ వ్యవహారమే అని చెబుతుంటారు.

చాలా కాలంగా తరుణ్ సినిమాల్లో నటించడం లేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనీ తెలుస్తోంది.

అయితే, సోలో హీరోగా కాదట. ఓ స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడనీ తెలుస్తోంది. మల్టీ స్టారర్ మూవీ అని అంటున్నారు.

తరుణ్ సినిమాల్లో లేకపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే వుంటాడు. మొన్నా మధ్య డ్రగ్స్ వ్యవహారంలో తరుణ్ పేరు వినిపించింది. నిహారిక పెళ్లి.. అంటూ మరో గుస గుస గుప్పుమన్నది. అయితే వాటన్నింటినీ తరుణ్ ఖండిస్తూ వస్తున్నాడు. మరి, ఈ కొత్త ప్రాజెక్ట్ ముచ్చట ఏం జరుగుతుందో చూడాలిక.