RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై విదేశీయులు ప్రశంశలు… ఆశ్చర్యపోయిన జక్కన్న!

RRR Movie: టాలీవుడ్‌ స్థాయిని మరోమారు ప్రపంచానికి తెలియజేసిన ఘనత ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ దే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. భారీ అంచనాల మధ్య ఇద్దరు స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ప్రధా పాత్రలు పోషించిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి ఓ అద్భుతాన్ని సృష్టించారు. తాను కలలు ఉన్న ఊహాలోకానికి ప్రాణం పోసి సినిమా రూపంలో అందరి ముందు ప్రదర్శించారు. దీంతో కేవలం అభిమానులనే కాదు, మామూలు ప్రజానికాన్ని కూడా థియేటర్లకు రప్పించేలా చేసింది ఈ సినిమా. ప్రపంచ వ్యాపందా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది.

కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ మానియానే కనిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ విషయానికొస్తే రిపీటెడ్ మోడ్‌లో ఈ సినిమాను వీక్షిస్తున్నారు.. విజువల్‌ వండర్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది.బాహుబలి వంటి భారీ సక్సెస్ తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ మూవీకి రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను తాజాగా ముంబైలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా రాజమౌళి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యునైటైడ్ స్టేట్స్ ఈ సినిమాను ప్రశంసిస్తుందని తాను ఊహించలేదని, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ రెండు సినిమాలూ విదేశీ ప్రేక్షకుల ఆదరణ పొందడం చాలా సంతోషం ఉందని ఆయన తెలిపారు. బాక్సాపీస్‌ నంబర్స్ ముఖ్యమనే విషయాన్ని కాదనలేమన్న ఆయన, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడమన్నది చాలా ముఖ్యమని ఈ సందర్భంగా చెప్పారు. మనం చేయగలిగింది ఏంటంటే 100శాతం ఇవ్వడం, అంతేగానీ అంకెలు మన చేతుల్లో ఉండవు కదా, అవి ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. మనం కేవలం వారి ప్రేమ, ప్రశంసలు మాత్రమే అంచనా వేయగలం అంటూ హార్ట్ టచింగ్ వర్డ్స్‌తో రాజమౌళి అందర్నీ ఆకట్టుకున్నారు.