Home News అఖిల్ 6 కి ఇద్దరు డైరెక్టర్స్ ..మరిది కోసం సాలీడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సమంత...

అఖిల్ 6 కి ఇద్దరు డైరెక్టర్స్ ..మరిది కోసం సాలీడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సమంత ..?

అఖిల్ 4 గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. సమంత గెస్ట్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. బడ్జెట్ కి వెనకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం కొన్ని సీన్స్ ని మళ్ళీ రీ షూట్ కూడా చేస్తున్నట్టు సమాచారం.

Mosteligiblebachelor | Telugu Rajyam

ఇక అక్కినేని కాంపౌండ్ లో నిర్మించే సినిమాలకి నాగార్జున ఇచ్చే జడ్జ్‌మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాంటి జడ్జ్‌మెంట్ నాగార్జున.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రష్ చూసిన నాగార్జున సూపర్ హిట్ అన్న మాట చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తో కలిసి సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దాదాపు 35 కోట్లు బడ్జెట్ ని కేటాయించినట్టు సమాచారం.

Family Man 2 Raj | Telugu Rajyam

అయితే అఖిల్ సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమా కన్‌ఫర్మ్ అవుతుండటం గొప్ప విషయం. ఇప్పుడు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ కాకుండానే అఖిల్ 5 ప్రకటించారు. ఈ సినిమా సెట్స్ మీదకి రాకుండానే అఖిల్ 6 కోసం స్వయంగా సమంత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే లతో మరిది కోసం సమంత సినిమా సెట్ చేస్తుందట. ఇప్పటికే వైజయంతి మూవీస్ లో అఖిల్ సినిమా చేసేందుకు డేట్స్ ఉన్నాయట. రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే దర్శకులుగా అఖిల్ 6 ని సి అశ్వనీ దత్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.

- Advertisement -

Related Posts

స్వలింగ వివాహం .. కేంద్రం ఏం చెప్పిందంటే ?

ఒకే జెండర్‌ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన...

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

Latest News