ఫ్లాష్ న్యూస్ : లాస్ట్ మినిట్ లో “అవతార్ 2” యూనిట్ కి కరోనా షాక్.!

మరికొన్ని రోజుల్లో పాన్ వరల్డ్ సినిమా దగ్గర ఎర్త్ షట్టరింగ్ రికార్డులు అయితే నమోదు కానున్నాయని చెప్పాలి. ప్రపంచ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ సినిమా “అవతార్ 2” ఈ డిసెంబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

అయితే ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత మేకర్స్ ఎట్టకేలకి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో తీసుకొస్తున్నారు. మరి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఈ చిత్ర యూనిట్ కి కరోనా మహమ్మారి షాకిచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా ఎఫెక్ట్ లేదు అనుకుంటూ ఉండగా..

ఇప్పుడు ఏకంగా కరోనా అవతార్ చిత్ర దర్శకుడు జేమ్స్ క్యామెరాన్ కి సోకడం షాకింగ్ గా మారింది. ఇందులో మరి ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం హాలీవుడ్ ప్రీమియర్ ని నేడు ప్లాన్ చేయగా ఇప్పుడు సరిగా దీనికి హాజరయ్యే ముందు క్యామెరూన్ కి కరోనా రావడం గమనార్హం.

దీనితో అయితే తాను లేకుండానే ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ జరగనున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే చివరి నిమిషంలో చిత్ర యూనిట్ కి ఇలా ఊహించని షాక్ తగిలింది. అలాగే సినిమా రిలీజ్ డిసెంబర్ 16 వరకు కూడా క్యామెరాన్ సినిమా సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చెయ్యలేరని కూడా చెప్పాలి.