ఐదేళ్ల పుష్ప ప్రయాణం.. ఎమోషనల్ అవుతున్న బన్నీ!

పుష్ప సినిమా అనౌన్స్ చేసి ఐదేళ్లు అవుతుంది. 2019లో మొదలైన పుష్ప సినిమా ప్రయాణం ఈ సంవత్సరం డిసెంబర్ 5న ముగియనుంది. మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని క్రేజ్ ని సాధించింది పుష్ప. దేశంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు పుష్ప 2 విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లు కూడా మంచి జోరుగా సాగుతున్నాయి.

కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా గట్టి ప్రమోషన్లు ప్లాన్ చేసింది చిత్ర బృందం. మొన్న పాట్నాలో ట్రైలర్ ఈవెంట్ జరిగిన తర్వాత తాజాగా ముంబైలో పుష్ప 2 ఐకానిక్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అక్కడికి అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా వచ్చింది. అక్కడ మీడియాతో బన్నీ మాట్లాడుతూ తన పుష్ప జర్నీ గురించి చెప్పుకొచ్చారు.

పుష్ప సినిమా స్టార్ట్ అవ్వడం, తన కొత్త ఆఫీస్ స్టార్ట్ అవ్వడం, పుష్ప 1 రిలీజ్, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్, పుష్ప టు లో తన లాస్ట్ డే షూట్ గురించీ, ఇలా ప్రతి విషయం పై ట్వీట్లు చేసిన బన్నీ ఆ విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యారు. ఐదు సంవత్సరాల ఈ జర్నీ డిసెంబర్ 5న ముగియనుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో పాటు మూడు పాటలు విడుదలయ్యాయి.

అన్నీ పాటలు హిట్ అవ్వడంతో సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇంకొక ఐదు రోజులలో సినిమా విడుదల కాగా పుష్ప 2కి ఫ్రీ రిలీజ్ బిజినెస్ చాలా హై రేంజ్ లో సాగింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని తెలుగు అభిమానులతో పాటు దేశంలో ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి స్క్రీన్ మీద బన్నీని చూడని తన అభిమానులకు ఈ సినిమా పెద్ద పండుగ తోనే సమానం.

Moments from the Journey of Pushpa | #AlluArjun | #PushpaICONICPressMeet | #Pushpa2TheRule