యయ్.. ఫైనల్ గా ఓటిటిలో అనుష్క కం బ్యాక్ చిత్రం 

టాలీవుడ్ సినిమా దగ్గర సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా అనుష్క థియేట్రికల్ గా బాహుబలి తర్వాత అందుకున్న హిట్ “భాగమతి” అయితే దాని తర్వాత మళ్ళీ ఆమె నుంచి సరైన సినిమా రాలేదు.

అలా ఎంతో కాలం గ్యాప్ అనంతరం దర్శకుడు మహేష్ బాబుతో చేసిన సినిమానే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్స్ లో ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే ఈ సినిమా మంచి హిట్ గా నిలిచి సాలిడ్ వసూళ్లు అందుకుంది.

ఇక ఫైనల్ గా అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన నెల లోపే ఓటిటి లోకి వచ్చేసింది. ఈ సినిమా గత సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రాగా ఈ నెల కంప్లీట్ అవ్వకుండానే ఓటిటి లో ఈ చిత్రం ఈ అక్టోబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

దీనితో ఈ హిట్ సినిమా మరోసారి వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రం ఇప్పుడు తెలుగు హిందీ తమిళ్ మరియు మలయాళ కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే అప్పుడు చాలా మంది ఈ సినిమా చూడని వారు ఇప్పుడు అయితే ఓసారి ట్రై చేయొచ్చు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.