మొత్తానికి అక్కినేని హీరోకి ఈ ఏడాదిలోనే హిట్..!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో పలు భారీ డిజాస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే అక్కినేని వారి ఫ్యామిలీ కి ఈ ఏడాది ఏమంత కలిసి రాలేదు అని చెప్పాలి. అఖిల్ అక్కినేని అలాగే యంగ్ హీరో నాగ చైతన్య లు నటించిన ఏజెంట్, కస్టడీ చిత్రాలు వరుసగా రిలీజ్ అయ్యి వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.

దీనితో ఈ ఏడాదిలో అక్కినేని అభిమానులు మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యారు కానీ ఇప్పుడు మళ్ళీ వారు ఇదే ఏడాదిలో తలెత్తుకునేలా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య చేసాడు. కాగా తాను నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ “దూత” నిన్ననే స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా ఇందులో ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక ఒక్క నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా రాలేదు. దీనితో తాను చేసిన మొదటి ఓటిటి సిరీస్ నే సూపర్ హిట్ అయ్యింది.

అలా ఈ ఏడాదిలోనే అక్కినేని హీరో ఫైనల్ గా హిట్ ని అందుకున్నాడు. కాగా ఈ సిరీస్ ని అక్కినేని హీరోస్ తోనే సూపర్ చిత్రాలు “మనం” “హలొ” లాంటి చిత్రాలు చేసిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు. మరి తెలుగులోనే తెరకెక్కించిన ఈ సిరీస్ పాన్ ఇండియా భాషల్లో ఓటిటీలో అందుబాటులో ఉంది.