అన్నీ తిరిగి “గుంటూరు కారం” కే లాస్???

తెలుగు సినిమా దగ్గర రాబోతుంది అతి పెద్ద మూవీ ఫెస్టివల్.. రేపు కొత్త సంవత్సరం తర్వాత సంక్రాంతి బరిలో ఎన్నో భారీ సినిమాలు దిగబోతున్నాయి. కాగా ఆ చిత్రాల్లో మోస్ట్ అవైటింగ్ గా ఉన్న కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి.

అయితే షూటింగ్ ఇంకా ఇతర పనులు చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ పట్ల చాలా ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎందుకంటే ఈ చిత్రం తోనే ఇతర చాలా సినిమాలు ఉన్నాయి. అయితే మహేష్ ఎలాగో పెద్ద స్టార్ కాబట్టి డెఫినెట్ గా డిస్ట్రిబ్యూటర్స్ మహేష్ సినిమాకి ఎక్కువ మొగ్గు చూపుతారు.

కానీ ఇక్కడ మేటర్ ఏమిటంటే రానున్న సంక్రాంతి అన్ని సినిమాల్లో కూడా ఆల్ మోస్ట్ ప్రతి సినిమాకి గట్టి నిర్మాతల అండ ఉంది. అటు హనుమాన్ చూస్తే మైత్రి మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యాక్ ఎండ్ ఉంటే ఇటు వెంకీ మామ సినిమాకి సురేష్ ప్రొడక్షన్స్ వారి థియేటర్స్ బ్లాక్ చేసుకుంటున్నారు.

అలాగే నాగార్జున నా సామిరంగా విషయానికి వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ కి ఉండేవి వాళ్ళకి కూడా ఉన్నాయి. దీనితో అంతా తిరిగి గుంటూరు కారం కే ఎసరు పెట్టేలా ఉన్నారని కొన్ని రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే గుంటూరు కారం సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా తనకి కూడా తెలుగు రాష్ట్రాల్లో తక్కువ స్క్రీన్స్ అయితే లేదు సో గుంటూరు కారం కి తప్పకుండ ఓ బిగ్ రిలీజ్ ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే మిగతా సినిమాలు వల్ల గుంటూరు కారం కి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనే చెప్పాలి.