రాజమౌళితో సినిమా చేయడం నావల్ల కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన జక్కన్నకే చెల్లుతుంది.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎందుకు విరుద్ధంగా తనకు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చిన చేయనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాజమౌళి గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా రాజమౌళి గురించి చిరంజీవి మాట్లాడుతూ తెలుగు సినిమా సత్తా ఏంటో అందరికీ పరిచయం చేసిన గొప్ప వ్యక్తి మన జక్కన్న అలాంటి దర్శకుడితో సినిమా చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. అయితే తను మాత్రం ఆయన సినిమాలలో నటించనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

రాజమౌళి సినిమా చేయాలంటే ప్రాణం పెట్టి చేస్తారు సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా లోతుగా ఆలోచించి తనకు తగ్గట్టుగా ఆ సన్నివేశం రావడానికి ఎంతో శ్రమిస్తారు. అలా ఆయన సినిమాలో అనుకున్న విధంగా నేను నటించలేనేమోనని మెగాస్టార్ చెప్పడమే కాకుండా ఆయన ఒక్కో సినిమాని దాదాపు రెండు మూడు సంవత్సరాలు చేస్తారు. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను అంటూ ఈ సందర్భంగా మెగాస్టార్ వెల్లడించారు. ఆయన రాజమౌళి దర్శకత్వంలో చరణ్ రెండు సినిమాలు చేశారు. ఆ సంతోషం నాకు చాలు మునుముందు వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తెలియచేశారు.