నటి వేదిక కీలక భూమికలో ఫియర్‌!

కథానాయిక వేదిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ’ఫియర్‌’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకి హరిత గోగినేని దర్శకత్వం చేస్తుండగా, దత్తాత్రేయ విూడియా బ్యానర్‌ పై ప్రొడ్యూసర్‌ ఏఆర్‌ అభి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో ఉంటుందని దర్శకురాలు హరిత గోగినేని చెపుతున్నారు. ఇందులో అరవింద్‌ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్స వానికి సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌, దర్శకుడు కరుణాకరన్‌ ముఖ్య అతిధులుగా వచ్చి టీముకి తమ అభినందనాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ తేజ కాకుమాను, బిగ్‌ బాస్‌ ఫెమ్‌ సోహైల్‌ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్‌ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని కథానాయకురాలు వేదిక చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక సస్పెన్స్‌, థ్రిల్లర్‌ చిత్రం చెయ్యడం తనకి ఇదే మొదటిసారి అని చెప్పింది.

ఆమె పాత్రలో ఎన్నో వైవిధ్యాలు వుంటాయని, అలాగే తన నటనని కనపరిచే చిత్రం ఇది అవుతుందని చెప్పింది. ఇంతకు ముందు తెలుగులో ’కాంచన’, ’రూలర్‌’ సినిమాల్లో నటించాను, అలాగే ఓ వెబ్‌ సిరీస్‌ చేశాను కానీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలో నటించలేదు.

ఇప్పుడు దర్శకురాలు హరిత గోగినేని ఎడ్జ్‌ ఆఫ్‌ సీట్‌ థ్రిల్లర్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసి ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను బాగా ఇంప్రెస్‌ అయ్యాను. ’స్టోరీ, క్యారెక్టర్స్‌ డిజైన్‌ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్‌ అని నాకు అనిపించలేదు. అవార్డ్‌ విన్నింగ్‌ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్‌ తో ఈ ’ఫియర్‌’ సినిమా చేస్తున్నాం. తప్పకుండా విూ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పింది వేదిక.