చాలా నెలలుగా బ్యాలెన్స్ ఉన్న వకీల్ సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ నవంబర్ 1 వ తేదీ నుంచి సెట్ లో అడుగు పెట్టినట్టు సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పిస్తున్నారు. నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుంది.
థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలో మరో సాంగ్ కూడా రిలీజ్ కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్ గా 20 రోజులు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తం మీద నవంబర్ చివరకి వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా మొదలై మార్చ్ లేదా ఏప్రిల్ వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేశారట మేకర్స్.
దాంతో నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలవనుంది కాబట్టి పక్కాగా ప్లాన్స్ అన్ని సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అన్నిటికంటే హరీశ్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందే సినిమా మీదే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోను భారీగా అంచనాలున్నాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం ఉన్న హరీశ్ శంకర్ పవన్ కోసం క్యారెక్టర్ ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తాడు. ఆ క్రమంలోనే హరీశ్ శంకర్.. పవన్ ని డాన్ గా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. డాన్ క్యారెక్టర్ అంటే మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ డాన్ పవర్ స్టార్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగాయంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజమెంతుందో.