ఎఫ్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే రెడీ !

ఎఫ్ 3 నుంచి సడన్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఎఫ్ 3 ఇలా మొదలైందో లేదో అలా చక చకా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని మూడింతలు ఫన్ తో తీసుకు రాబోతున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. వెంకటేష్ కి జంటగా తమన్నా.. వరుణ్ తేజ్ కి జంటగా మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. అంతేకాదు మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారని సమాచారం. ఎఫ్ 2 100 కోట్ల పైగా వసూళ్ళు సాధించడంతో దిల్ రాజు – అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ మీద మరింతగా భారీ అంచనాలను పెట్టుకున్నారు. కాగా ఇప్పటికే ఎఫ్ 3 ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ రిలీజై సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక ఈ సీక్వెల్ కథ డబ్బు నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లోనే వెల్లడించాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ సినిమా కన్ఫ్యూజన్ కథతో సాగుతుందని, అందులో నుంచి పుట్టుకొచ్చే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

కాగా తాజాగా ఎఫ్ 3 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు దిల్ రాజు బృందం. అందరు విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని భావించారు. కాని అంతకంటే ముందే ఎఫ్ 3 మూడింతల ఫన్ తో ప్రేక్షకులను రాబోతుందని తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆగస్ట్ 27 న ఎఫ్ 3 సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా పుష్ప.. గని.. అరణ్య.. విరాట పర్వం.. సీటిమార్ సినిమాల రిలీజ్ డేట్ ని ప్రకటించాయి. ఇక రీసెంట్ గా రాజమౌళి.. ఎన్.టి.ఆర్ – రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ ని అక్టోబర్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఎఫ్ 3 ఆర్ ఆర్ ఆర్ కంటే చాలా ముందు రిలీజ్ కాబోతోంది.