కేసుల నుంచి “ఆనిమల్” ఓటిటి రిలీజ్ పై ఎగ్జైటింగ్ న్యూస్ 

గత ఏడాదిలో బాలీవుడ్ సినిమా అందించిన పలు భారీ హిట్ చిత్రాల్లో ఏడాది ఎండింగ్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. కాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ల కాంబినేషన్ లో తెరకెక్కించిన మొదటి సినిమా ఇది కాగా ఏ సర్టిఫికెట్ కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు కొల్లగొట్టి సంచలనం రేపింది.

దీనితో “ఆనిమల్” బాలీవుడ్ హిస్టరీ లోనే ఏ సర్టిఫికెట్ తో హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలవగా ఈ సినిమాని ఓటిటి లో చూద్దామని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రం రిలీజ్ ని నెట్ ఫ్లిక్స్ లో ఆల్రెడీ కన్ఫర్మ్ చేయగా దీనిపై ఇప్పుడు క్రేజీ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

గత కొన్నాళ్ల నుంచి అయితే సినిమా ఓటిటి రిలీజ్ ని ఆపాలని సినిమా నిర్మాతల్లో ఒకరు కేసు వేశారు కానీ ఇవేవి ఇప్పుడు కేసులు ఏవి అవి వేసినవారికి అనుకూలంగా లేనట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ జనవరి 26నే పాన్ ఇండియా భాషల్లో ఆనిమల్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేస్తుంది అని సినీ వర్గాల వారు కన్ఫర్మ్ చేస్తున్నారు.

కాగా ఇక్కడ మరో ఎగ్జైటింగ్ న్యూస్ ఏమిటంటే ఈ చిత్రం ఒరిజినల్ మీద మరో 8 నిముషాలు ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. దీనితో మొత్తం మూడున్నర గంటల సేపు ఓటిటి లో ఈ సినిమా ట్రీట్ ఇస్తుంది అని సినీ ప్రముఖులు చెప్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా, త్రిప్తి దిమిరి లు హీరోయిన్స్ గా నటించారు.