ఆ ఒక్క కారణంతోనే సినిమాలకు దూరంగా ఉన్నా… నటుడు అజయ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ పాత్రలలో నటించి అందరిని మెప్పించిన వారిలో నటుడు అజయ్ ఒకరు. ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలోనూ లేదా విలన్ పాత్రలలోను నటించి మెప్పించిన ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయన దిక్కులు చూడకు రామయ్య అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుత సినిమాలలో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈయన ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్ళు పూర్తి కావడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన 22 ఏళ్ల సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ ఒకానొక సమయంలో తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని అయితే అలా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం మరి ఏది కాదని తనకు తగ్గ పాత్రలు రాకపోవడం వల్లే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నేనెప్పుడూ కూడా నా పాత్రకు మంచి ఆదరణ ఉన్న పాత్రలలోనే నటిస్తాను ఈ 22 సంవత్సరాల నుంచి అలాగే నటిస్తున్నానని తెలిపారు.

ఇకపై కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తానని లేకపోతే సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కూడా తాను ఏమాత్రం వెనకాడనని అజయ్ వెల్లడించారు.ఇకపోతే ఈయన విలన్ పాత్రలలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా విలన్ గా నటించడం పై కూడా ఈయన తన అభిప్రాయాన్ని తెలిపారు.శ్రీ మహాలక్ష్మి సినిమాలో తాను విలన్ గా నటించానని ఇందులో ఓ అమ్మాయిపై రేప్ చేసే సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు అయితే ఆ అమ్మాయి పై ఇలాంటి సన్నివేశం షూట్ చేస్తున్న విషయాన్ని చెప్పకుండా దర్శకుడు ఈ సన్నివేశాన్ని ప్లాన్ చేశారు.అయితే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు వేసిందని దాంతో నేను ఏ సన్నివేషంలో నటించనని డైరెక్టర్ కి తెగేసి చెప్పానంటూ ఈ సందర్భంగా అజయ్ గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.