“RRR” కి ఎమోషన్ ని అడ్డుపెట్టడం ఎంత వరకు సమంజసం గురూ..?

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా నుంచి భారతీయ సినిమా ని మళ్లీ ఓ రేంజ్ లో ఉర్రూతలు ఉపడానికి సిద్ధం అవుతున్న చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి. ఇక సమయం దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ అన్నీ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు.

ఆల్రెడీ ఏపీ లో టికెట్ ధరల విషయం పై అక్కడి ప్రభుత్వం తో మాట్లాడుతాం అని చెప్పగా.. ఈ సినిమాకు ధరలు ఎందుకు పెంచాలి అనే దానిపై కొంతమంది ఓ ఎమోషన్ కోణాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాతంత్ర్య సమర యోధులుపై తీసింది కాబట్టి ఆ వెసులుబాటు ఖచ్చితంగా ఇవ్వాలని అది తెలుగు రాష్ట్రాల బాధ్యత అని వారి హీరోల అభిమానులు అంటున్నారు.

అయితే ఇక్కడ వసూళ్ల ఇంటెన్షన్ తప్పితే నిజమైన ఎమోషన్ ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇదెలా ఉంది అంటే ఈ ఒక్క సినిమాకి పెంచి మిగతా సినిమాలకి కూడా తగ్గించేసినా పర్వాలేదు అనే యాంగిల్ లో ఉంది. ఇప్పటికే ఈ కొత్త టికెట్ ధరల మూలన చాలా నష్టం జరిగింది. ఇక మీద అయినా ఏపీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.