Rajamouli : రాజమౌళి కి గట్టి పోటీ ఇస్తున్న డైరెక్టర్లు..! హీరోల ఛాయిస్ కూడా మారుతుందా..?

Rajamouli : ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు చలనచిత్ర గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు దర్శకుడు రాజమౌళి. అంతేకాదు బాహుబలి సినిమా తో హీరో ప్రభాస్ ని పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మార్చేశాడు. ఇంతవరకు బాలీవుడ్ సినిమాలు కూడా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయాయి.ఇక మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావాలి అంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలి అన్న అపోహ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ లెక్కలో మారుతున్నాయి అనే చెప్పుకోవచ్చు.

ఇటీవల వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఇద్దరు స్టార్ హీరోలు దాదాపు మూడేళ్ళ పాటు కష్టపడి తీసినా మరి అంత ఆశించిన ఫలితం రాలేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇతర డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చిత్రీకరించి హీరో లను పాన్ ఇండియా స్టార్ లుగా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. మిగిలిన హీరోలకు వచ్చిన ఇమేజ్ తో పోలిస్తే ఆర్ఆర్ఆర్ హీరోలకు వచ్చిన ఇమేజ్ తక్కువ అనే అంటున్నారు.

ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమా తో యశ్,ఇంకా పుష్పా సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు. వీరే కాదు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హిట్ అయితే, విజయ్ దేవరకొండ కి కూడా బాలీవుడ్ ఆఫర్స్ క్యూ కడతాయ్ అన్న ఆశ్చర్యపోనవసరం లేదు.దీనిబట్టి హీరో కి పాన్ ఇండియా ఇమేజ్ రావాలి అంటే రాజమౌళి ఒకటే మార్గం కాదు అని అర్థమవుతోంది.హీరోల ఛాయిస్ కూడా ఇప్పుడు మారే అవకాశాలు కనిపించక పోలేదు.