Danayya : సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ మాములే. హీరోలు, ప్రొడ్యూసర్లు,డైరెక్టర్లు, సహనటుల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటీవలే మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు మొదటి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. క ఎన్టీఆర్ బావ మరిది కూడా తన మొదటి చిత్రాన్ని షురూ చేసారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పనక్కరలేదు. అందరు దాదాపు హీరోలుగా వచ్చేసారు. ఇక ఈ మధ్యనే ప్రముఖ పారిశ్రామిక , రాజకీయ వేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ ని వారహి వారు గ్రాండ్ గా పరిచయం చేసారు.
ఇపుడు మరో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య కొడుకు కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక కళ్యాణ్ హీరోగా మారేందుకు నటన, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. పూర్తిగా యంగ్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చాలా రిచ్ గా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది.