మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటి, కనులు కనులను దోచాయంటే వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ ఇటీవల సీతారామన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదిలా వుండగా ఇటీవల దుల్కర్ సల్మాన్ తన భార్య పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తన భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నా స్వీటెస్ట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మనమిద్దరం ఒక్కటై ఇప్పటికే 12 సంవత్సరాలు పూర్తయింది. ఆ సమయం అంతా ఎక్కడికి పోయింది..? నేను ముసలోడిని అవుతున్నా కూడా నువ్వు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నావు. నేను దూరంగా ఉన్న సమయంలో కూడా ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ ఏడాది నీకు బెస్ట్ బర్త్ డేగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. లవ్ యు..అంటూ దుల్కర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేస్తూ తన భార్య మీద ఉన్న ప్రేమని తెలియజేశాడు.
ఇక ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణల్ ఠాగూర్ జంటగా నటించిన సీతారామం సినిమా మొదట తెలుగు తమిళ భాషలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల హిందీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సీతారామం జంట కి తెలుగులో మరొక సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.