Trivikram : మాటల మాంత్రికుడిని టాప్ హీరోలు పక్కన పెడుతున్నారా…!

Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో బిజీ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ స్టయిల్ డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా అలా వైకుంఠపురంతో సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు.ఇక అలా వైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక పవన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా భీమ్లా నాయక్ సినిమా కు స్క్రీన్ ప్లే అందించారు. గురూజీ స్క్రీన్ ప్లే, మాటలు ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటాయి.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో సినిమా కు సిద్ధం అవుతున్నారు. త్వరలో మహేష్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అనే విషయానికి త్రివిక్రమ్ దగ్గర సమాధానం లేదు. ఏ హీరోతోను ప్రాజెక్ట్ కమిట్ మెంట్ లేదు. అరవింద వీర రాఘవ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ తో చేయాల్సి ఉన్న ఆ ప్రాజెక్ట్ పై ఇంకా స్పష్టత లేదు.

ఇక బన్నీ పుష్ప షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ గురూజీ తో సినిమా కష్టమే. ఇక పవన్ తనకు ప్రస్తుతం లైన్లో ఉన్న సినిమాలను పూర్తి చేసి 2024 ఎన్నికలకు సిద్ధం అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా ఛాన్స్ దాదాపుగా లేనట్టే.ఇక రామం చరణ్, ప్రభాస్ లతో ఇంత వరకు గురూజీ సినిమా చేయలేదు.కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ తో వాళ్లు బిజీగా ఉన్నారు. దీన్ని బట్టి ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఏ టాప్ హీరోను సినిమా చేసే అవకాశం లేదు.