ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇటీవల శత్రుఘ్నసిన్హా పిల్లల పెంపకన్ని తప్పుపడుతూ మాట్లాడిన మాటలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం స్పందిస్తూ జరిగిపోయిన విషయాన్ని పదేపదే ఎందుకు నవ్వుతున్నారు తన తండ్రి చక్కగా పెంచాడు కాబట్టే ఇప్పుడు శాంతంగా మాట్లాడుతున్నాను, ఇంకొకసారి తడి తండ్రి గురించి ఇలా మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది సోనాక్షి సిన్హా. అసలు ముఖేష్ ఖన్నా ఏమన్నాడు ఎందుకు సోనాక్షి అంతగా మండిపడిందో ఒకసారి తెలుసుకుందాం.
2019లో కోన్ బనేగా కరోడ్పతి లో సోనాక్షి సిన్హా పాల్గొని అప్పుడు అమితాబ్ రామాయణానికి సంబంధించి ఆంజనేయుడు ఎవరికోసం సంజీవని ని తీసుకువస్తాడు అని ఒక ప్రశ్న వేస్తే సోనాక్షి దానికి సమాధానం చెప్పలేకపోయింది. అయితే ఈ విషయంపై నటుడు ముఖేష్ కన్నా స్పందించాడు అది వాళ్ళ తండ్రి పెంపకం, కనీసం రామాయణం గురించి కూడా చెప్పలేదు అంటూ శత్రుజ్ఞ సిన్హా పెంపకాన్ని తప్పుపడుతూ మాట్లాడాడు.
అయితే మళ్లీ ఇప్పుడు ముఖేష్ కన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేటితరం పిల్లలకి శక్తిమాన్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. వారు తమ అమ్మమ్మ, తాతయ్యల పేర్లు కూడా గుర్తుంచుకోవడం లేదు. హనుమంతుడు ఎవరికోసం సంజీవని తెచ్చాడు అనే ప్రశ్నకి సమాధానం కూడా చెప్పలేక పోయింది ఒక అమ్మాయి అన్నాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు సోనాక్షి సిన్హా గురించి మాట్లాడుతున్నారా అంటే అవును అని చెప్పాడు ముఖేష్ కన్నా.
అందుకు ప్రతి స్పందించిన సోనాక్షి తన తండ్రి గురించి అలా మాట్లాడొద్దని, అందరికీ అన్ని గుర్తుంటాయని చెప్పలేము. ఒకవేళ తెలిసినా ఆ టైంకి ఆన్సర్స్ గుర్తుకు రాకపోవచ్చు. అయినా ఎప్పుడో జరిగిండాన్ని మళ్లీ పదే పదే ఎందుకు తవ్వుతున్నారు. మీరు మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకండి, ఆయన పెంపకం గురించి మాట్లాడకండి ఆయన పద్ధతిగా పెంచాడు కాబట్టే ఇప్పుడు నేను మీతో ఇలా శాంతంగా, నిదానంగా సుతి మెత్తగా మాట్లాడుతున్నాను అంటూ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చింది సోనాక్షి.