తెలుగు స్టార్ హీరోగా, మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన నటనతో విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.ఈ క్రమంలోనే రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ హీరో శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కోసం ఏకంగా ముంబై నుంచి ప్రత్యేక టీమ్ ను రప్పించిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు హెయిర్ స్టైలిస్ట్‌కు మాత్రమే ప్రొడక్షన్ టీమ్ ఒక్క రోజుకి రూ.1.5-2 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారట.
ఈ స్టైలిస్ట్‌కు ముగ్గురు అసిస్టెంట్ లో ఉండడంతో వీరికి రావడానికి ఫ్లైట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ ప్రొడక్షన్ హౌస్ భరించడనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం వీరు ఈ సినిమా పూర్తి చేసుకునే సరికి సుమారు ఒక కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి పాన్ ఇండియా స్థాయి చిత్రం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా అంటే ఈ మాత్రమైనా ఉండాలని పలువురు భావిస్తున్నారు.