నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పాపులర్ అయింది కీర్తి సురేష్. కాని ఎప్పుడైతే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమాలో నటించిందో అప్పటి నుంచి కీర్తి సురేష్ క్రేజ్ ఒక్క టాలీవుడ్ లోనే కాదు సౌత్ మొత్తం కీర్తి ని గొప్పగా కీర్తించింది. ఈ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ కి వచ్చిన పాపులారిటీ ఒక పదేళ్ళ పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. మహానటి పాత్రలో జీవించినందుకు ముఖ్యమంత్రులు సహా ఎందరో కీర్తి సురేష్ ని ప్రశంసలతో ఆకాశానికి మోసేశారు.
ఆ తర్వాత వరసగా ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్రేజీ హీరోయిన్ గా మారింది. చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ కథ అంటే కీర్తి సురేష్ తప్ప మరొక పేరు ప్రస్తావించడం లేదు మేకర్స్. ఈ క్రమంలోనే పెంగ్విన్, గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు సర్కారు వారి పాట, రంగ్ దే, అన్నాత్తే లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తుంది.
ఇక కియారా అద్వాని .. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా భరత్ అనే నేను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ అన్న క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమా చేసింది. అయితే బాలీవుడ్ లో ధోని తో గుర్తింపు పొందిన కియారా ఆ తర్వాత చేసిన లస్ట్ స్టోరీస్ అన్న అడల్ట్ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సాధించింది.
దాంతో తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సహా పలు క్రేజీ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ సినిమాలకి డేట్స్ సర్దుబాటు చేయలేనంత బిజీగా మారింది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందబోయో భారీ ప్రాజెక్ట్ ఆది పురుష్ లో సీత పాత్ర కి కియారా, కీర్తి సురేష్ ల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దాంతో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాకి కియారా నటించిన లస్ట్ స్టోరీస్ కి లింక్ పెట్టి కొందరు కామెంట్స్ చేస్తున్నారట. కియారా ని సీత గా ఎలా చూడాలి అంటూ మాట్లాడుకుంటున్నారట. కాని అభిమానులు, మేకర్స్ మాత్రం ఆ సినిమాలని దృష్ఠిలో పెట్టుకోకుండా క్రేజ్ పరంగా చూస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ పాత్రకి ఇద్దరు పర్‌ఫెక్ట్ అని కాకపోతే ఫైనల్ డెసిషన్ మేకర్స్ చేతిలో ఉందని చెప్పుకుంటున్నారు.