బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ని ఇప్పుడు ఒక కుదుపు కుదిపేస్తున్న వ్యవహారం డ్రగ్స్. ఇది పెద్ద మాఫియా అని చాలామంది ఇప్పటికే బహిరంగంగా మాట్లాడిన సందర్భాలున్నాయి కూడా. అయినా ఈ వ్యసనాన్ని వదలలేకపోతున్నారు. ఇది ఎక్కువగా సినిమా సెలబ్రిటీస్ ని పీడించడమే కాదు వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తుంది. ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడి పొట్ట మాడ్చుకొని సినిమాలలో అవకాశాలు సంపాదించుకొని స్టార్స్ గా పాపులారిటీని పొందుతున్నారు.
ఇంతలోనే ఊహించని విధంగా డ్రగ్స్ అంటూ.. కాస్టింగ్ కౌచ్ అంటూ అనవసరమైన వ్యవహారాలతో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్క రోజులో సర్వనాశనం అయిపోతుంది. కొన్ని సందర్భాలలో కొంతమందికి ఇలాంటి వ్యవహారాలలో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా అవకాశాల కోసం ఎక్కువగా పరిచయాలను పెట్టుకోవడంతో వీళ్ళు ఇరుక్కుంటున్నారు. అలాంటివే ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో చోటు చేసుకున్నాయి.
బాలీవుడ్ లో దీపిక పదుకొణె కి స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. పద్మావత్, భాజీరావ్ మస్తానీ లాంటి పీరియాడికల్ సినిమాలలో నటించి స్టార్ హీరో రేంజ్ లో నేషనల్ వైడ్ గా పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే బాలీవుడ్ లో ముదిరి పాకాన పడిన డ్రగ్స్ వ్యవహారంలో అనూహ్యంగా దీపిక పేరు నిలిచింది. ఇప్పుడిది దీపిక కమిటయిన సినిమాల మేకర్స్ ని కలవరపెడుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం దీపిక భర్త కి తెలియదా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కాగా దీపిక తో పాటు విచారణకు హాజరవుతానని ఎన్సీబీని రణవీర్ కోరినట్టు సమాచారం. అయితే ఇందుకు ఎన్సీబీ నిరాకరించిందట.