దుల్కర్ సల్మాన్ కు ఆ హీరో అంటే అంతిష్టమా ఈయన ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈయన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ క్రమంలోనే సీతారామం వంటి పూర్తిస్థాయి తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో చిత్ర బృందం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే సినిమా గురించి ఎన్నో ప్రశ్నలు వీరికి ఎదురు కావడంతో ఆసక్తికరమైన సమాధానాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా యాంకర్ హీరో హీరోయిన్లను మీ ఫేవరెట్ టాలీవుడ్ హీరోస్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దుల్కర్ సల్మాన్ చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.

ఈయన మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం అని తెలిపారు. ఇలా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని చెప్పగానే అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదే ప్రశ్న హీరోయిన్ కి ఎదురవడంతో ఆమె కూడా సమాధానం చెబుతూ తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని ఈ సందర్భంగా వీరి ఫేవరెట్ హీరోలు ఎవరో బయటపెట్టారు.