తమ్ముడు హీరోయిన్ సినిమాలకు దూరంగా ఏం చేస్తుందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఎక్కువగా యువతకు ఎంటర్టైన్మెంట్ ను అందించే చిత్రాలే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో తమ్ముడు అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన కరాటే స్కిల్స్ కూడా చూపించాడు. యంగ్ కుర్రాళ్ళకి ఈ చిత్రం తెగ నచ్చేసింది. ఈ చిత్రం అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చింది.

మరీ ఈ సినిమాలో ప్రీతీ జింగానీ, అదితి గోవిత్రికర్ హీరోయిన్స్ గా నటించడం జరిగింది. మరి అదితి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లవ్లీ క్యారెక్టర్ లో అందరినీ కట్టుకోవడం జరిగింది. పవన్ ‘వయ్యారి భామ నీ హంస నడక’ అని టీజింగ్ చేస్తూ వెంట పడింది ఈ భామ వెంటే. అయితే అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు మాత్రమే.

ఆ తరువాత పలు హిందీ చిత్రాల్లో ఈ భామ మెరిసింది. ఇప్పటికి కొన్ని సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తోంది. అదితి గతంలో మోడల్ గా బాగా రాణించింది. ఆమె ఇంకా టెలివిజన్ హోస్ట్ గా, బుల్లితెరపై కూడా కనిపించింది. ఆమె తమ్ముడు చిత్రం విడుదలయ్యే సమయానికే అదితి ఓ డాక్టర్ ని వివాహం చేసుకుని ఉంది. 2009 సంవత్సరంలో భర్త నుంచి విడిపోయింది. ప్రస్తుతం సింగిల్ గానే తన జీవితాన్ని గడుపుతోంది.

ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం అదితి గోవిత్రికర్ వయసు 43 ఏళ్ళు. తమ్ముడు తర్వాత అదితి హిందీ చిత్రాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ నటన మాత్రం కొనసాగిస్తోంది. అయినా కూడా హాట్ నెస్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. పొట్టి దుస్తుల్లో అదితి గోవిత్రికర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ బాగా అవుతున్నాయి.

ఈ వయసులో కూడా అదితి గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోంది. అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన బికినీ ఫొటోలు చూస్తే కుర్రాళ్ల మతి పోవలసిందే.
నాలుగు పదులు వయసులో కూడా సెక్సీ అందాలతో అదితి పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అదితి తన బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. తమ్ముడు హీరోయిన్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ బాగా యాక్టీవ్. ఇంకా స్వతహాగా అదితి మోడల్ కావడంతో ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.