తల్లిదండ్రులకి కర్మకాండ చేసిన మహేష్ బాబు ఎందుకు గుండు తీయించుకోలేదో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది.మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఈ ఏడాదిలోనే ముగ్గురు మరణించడంతో ఈయన ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలా ఒకే ఏడాదిలోనే తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో మహేష్ బాబు ఎంతో మనోవేదనకు గురి అయ్యారు.ఈ విధంగా తన కుటుంబ సభ్యులను ముగ్గురిని కోల్పోవడంతో మహేష్ బాబు ఈ సంఘటనల నుంచి ఇప్పుడే బయటపడలేకపోతున్నారు.

సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు మరణిస్తే వారికి కర్మకాండలు చేసిన వారు తప్పనిసరిగా తలనీలాలను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తల్లి తండ్రి ఇద్దరికీ కర్మకాండలు చేసినప్పటికీ ఆయన మాత్రం గుండు చేయించుకోలేదు. ఈ విధంగా మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు ఈయన గుండు చేయించుకోలేదు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ విధంగా మహేష్ బాబు తన తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన గుండు చేయించకపోవడానికి గల కారణం కేవలం తన చేయబోయే సినిమాలే అని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు తన తదుపరి సినిమా లుక్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తన జుట్టు కత్తిరించడం వల్ల తిరిగి చుట్టు రావడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైందని చెప్పాలి. అదేవిధంగా మహేష్ బాబు జుట్టు నిజమైన జుట్టు కాదు సహజంగా ఉండడం కోసం ఆయన క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం వల్ల తాను చుట్టు కత్తిరించలేదని తెలుస్తోంది.