సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకే కథాంశంతో, వేరు వేరు టైటిల్స్ తో సినిమాలు రావడం సర్వసాధారణం.అలాగే కథాంశం వేరే అయినప్పటికీ ఒకే టైటిల్ తో కూడా రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒకప్పుడు సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అలాగే చిరంజీవి నటించిన ఎన్నో సినిమా టైటిల్స్ తో ప్రస్తుతం కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో సూపర్ స్టార్ కృష్ణ,వెంకటేష్ ఇద్దరు కూడా ఒకే సినిమా టైటిల్ తో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
బాపయ్య దర్శకత్వంలో 1986 లో పరుచూరి బ్రదర్స్ రచించిన గ్రామీణ నేపథ్యంలో ఒక యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. ఈ సినిమాకు జయం మనదే అనే టైటిల్ పెట్టారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి జంటగా నటించారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా 1986 ఏప్రిల్ 10వ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇకపోతే ఇవే టైటిల్ తో విక్టరీ వెంకటేష్ కూడా సినిమా చేశారు.
సూర్యవంశం, కలిసుందాం రా, రాజా వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతున్న వెంకటేష్ తన సొంత బ్యానర్ లో ఎన్.శంకర్ దర్శకత్వంలో సౌందర్య వెంకటేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం జయం మనదేరా..భారతదేశం నుంచి కోకోకోలా సంస్థ తరపున కొంత మందిని లాటరీలో ఎంపిక చేసి యూరప్ పంపిస్తారు. అక్కడ వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా 2000 అక్టోబర్ 7 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఓ కే టైటిల్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలలో వెంకటేష్ నటించిన జయం మనదేరా సినిమా మంచి విజయాన్ని అందుకోగా కృష్ణ జయం మనదే సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
