అవకాశాల కోసం అలాంటి త్యాగానికి సిద్ధమైన ఇస్మార్ట్ బ్యూటీ.. ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఈమెకు పెద్దగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అనంతరం కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా నిధి అగర్వాల్ తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.సినీ పరిశ్రమలో హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ కోసం మాత్రమే చూస్తారని షాకింగ్ కామెంట్ చేశారు.టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు లేరు టాలెంట్ తో పాటు అందం కూడా ఉండాలని ఈమె తెలిపారు. అందుకే తాను గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడనని షాకింగ్ చేశారు.

ఈ విధంగా గ్లామర్ షో ఉండే పాత్రలలో అవకాశం వచ్చిన అస్సలు వద్దననీ తెలిపారు.అదేవిధంగా స్టార్ హీరోల సినిమాలలో కనుక అవకాశం వస్తే తాను రెమ్యూనరేషన్ పరంగా ఎలాంటి డిమాండ్స్ చేయనని నిర్మాతలు ఇచ్చిన రెమ్యూనరేషన్ తీసుకొని స్టార్ హీరోల సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పెద్ద హీరోల సినిమాలలో రెమ్యూనరేషన్ లేకుండా నటించే అవకాశాలు అందుకుంటే తదుపరి సినిమా అవకాశాలు వాటి అంతటావే వస్తాయని ఈ ముద్దుగుమ్మ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.