కార్తీకదీపం వంటలక్క గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క గురించి అందరికీ తెలిసిందే. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ పొందింది.కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఈమె తెలుగులో ఒక సీరియల్ కి మాత్రమే పరిమితమయ్యారు. ఇక మలయాళంలో ఈమె ఒక టీవీ షోలో హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా స్టూడియోల వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు.

ఈ విధంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వంటలక్క కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయని వెల్లడించారు. ఇలా తనకు స్టూడియోల వ్యవహారం చూసుకోవడమే సరిపోతుందంటూ ఈమె వెల్లడించారు. ఈమెకు కేరళలో స్టూడియోలు మాత్రమే కాకుండా ఖరీదైన ఆస్తిపాస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.కార్తీకదీపం సీరియల్ లో ఎంతో అమాయకంగా కనిపించే వంటలక్క నిజ జీవితంలో లా చదివి ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట ఈమె భర్త ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆయన పేరు డాక్టర్ వినీత్ భట్ . ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డ్ అందుకున్నారు.

ఇకపోతే ఈమె ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు మలయాళంలో సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా నాగచైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలో వంటలక్క కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈమెకు కేరళలో సుమారు 50 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది అభిమానులు వంటలక్క అమాయకంగా కనిపించిన ఈమె చాలా రిచ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.