ఎంగేజ్మెంట్ లో లావణ్య కట్టుకున్న చీర ధరెంతో తెలుసా?

టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా, వారు స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి వారి ప్రేమను తెలియజేశారు.

ఎంగేజ్మెంట్ ఫోటోల్లో లావణ్య చాలా అందంగా కనపడుతోంది. ఆకుపచ్చని రంగు పట్టుచీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. కాగా, తన ఎంగేజ్మెంట్ లో లావణ్య కట్టుకున్న చీర ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ చీర ధర అక్షరాలా రూ.75వేల రూపాయలు. ఈ చీర బాగా నచ్చి ధర కోసం నెట్టింట షేర్ చేయగా, ధర బయటకు వచ్చింది. ధర సంగతి పక్కన పెడితే, ఆ చీరలో లావణ్య లుక్ మాత్రం అదిరిందనే చెప్పాలి.

ఇక, వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలను ముందుగా వారే షేర్ చేసుకున్నారు.తనకు తన ప్రేమ దొరికింది అంటూ వరుణ్ క్యాప్షన్ పెట్టగా, తమ ప్రేమ 2016 లోనే మొదలైందని.. చివరి వరకు ఉంటుందని అంటూ లావణ్య క్యాప్షన్ పెట్టింది. దీంతో, ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా కుటుంబసభ్యుల మధ్య జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. కాగా, వరుణ్,లావణ్య లు చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటన్నా, ఎక్కడ బయటకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడటం విశేషం.

కాగా, వరుణ్, లావణ్యలకు మిస్టర్ మూవీ సమయంలో పరిచయం ఏర్పడింది. 2016లొ తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇక లావణ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన యువతి కాగా, అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున’. మరొకటి… ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.