Pawan Kalyan: ఆ రీమేక్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస రీమేక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళ రీమేక్ చిత్రంగా తెలుగులో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు రోజులు కావస్తున్న ఇప్పటికీ కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద అధిక కలెక్షన్లను రాబడుతోంది.ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అలాగే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగులు కూడా ప్రారంభమయ్యాయి.

కానీ ఈ రెండు సినిమాల కన్నా పవన్ కళ్యాణ్ ముందుగా మరొక రీమేక్ చిత్రంలో నటించనున్నారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన  ‘వినోదయ సిత్తం’సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను జీ 5స్టూడియోస్ నిర్మాణంలో తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చారని సమాచారం.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా కోసం ఇరవై రోజుల కాల్షీట్స్ ఇవ్వడంతో ఈయన ఏకంగా ఈ సినిమా కోసం యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఒక రోజుకు 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో సముద్రఖని దర్శకత్వంలోనే తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ పని చేయనున్నట్లు తెలుస్తోంది.