Aacharya: ఆచార్య కోసం మెగాస్టార్, రామ్ చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Aacharya:మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శక నిర్మాతలు పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం కోసం రామ్ చరణ్ చిరంజీవి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు.సినిమా విడుదల అయిన తర్వాత వచ్చిన లాభాలలో వాట తీసుకోనున్నట్లు వెల్లడించారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్, మ్యాట్ ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ పాత్రలో నటించారు.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదలకు సిద్ధమైంది.