Jathi Ratnalu: శ్రీముఖి జాతిరత్నాలు మొదటి వారానికి వచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా?

Jathi Ratnalu:బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్, కామెడీ స్టార్స్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను సందడి చేయగా తాజాగా ఈటీవీ ప్లస్ లో శ్రీముఖి వ్యాఖ్యాతగా జాతి రత్నాలు అనే మరొక కామెడీ షో ద్వారా మల్లెమాల ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన మాట తీరుతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకోవడంతో మొదటి వారానికి సంబంధించిన రేటింగ్ ప్రస్తుతం బయటకు వచ్చింది.అయితే ఈ కార్యక్రమం మొదటి వారం ప్రసారమయ్యే ఎంత రేటింగ్ సంపాదించుకుందనే విషయానికి వస్తే మొదటి వారం దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుందని చెప్పాలి. చెప్పుకోవడానికి కూడా వీలు లేనంతగా ఈ కార్యక్రమం రేటింగ్ సంపాదించింది. ఎన్నో అంచనాల నడుమ కమెడియన్లకు భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దగా ఫలితం రాలేదు.

ఇక ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే నిర్వాహకులకు పూర్తి నష్టాలు వస్తాయనే చెప్పాలి. ఇప్పటికే ఈ తరహా ఎన్నో కామెడీ షోలు ప్రేక్షకులను సందడి చేయగా ఇది కూడా అలాంటిదే కావడం అలాగే ప్రేక్షకులను సందడి చేయడంలో జాతిరత్నాలు విఫలమయ్యారనే చెప్పాలి.ఏది ఏమైనా ఈ కార్యక్రమ రేటింగ్ ఇలాగే కొనసాగితే మరొక రెండు వారాలలో ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుందని చెప్పాలి. చూడాలి ఈ కార్యక్రమం మంచి ఆదరణ పొంది దూసుకుపోతుందా.. లేదా ఎండ్ కార్డ్ పలుకుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.