అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చాలా సినిమాల్లో నటించారన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ మూవీలే కావడం మరొక విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిన్నప్పటి సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ విజయవంతమైన సినిమాల్లో ఒకటైన విజేత సినిమాలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే చిరంజీవి సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో కనిపించి అందరినీ ఆకర్షించడంతోపాటు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీ స్వాతిముత్యం సినిమాలో సీనియర్ కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

హీరో అల్లుఅర్జున్ గంగోత్రి, బన్నీ, ఆర్య, రేసుగుర్రం వంటి పలు విజయవంతమైన సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడంతోపాటు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నాడు.ఈ మధ్యకాలంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ సాధించడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే.అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారన్న వార్త వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ చిత్ర యూనిట్ దగ్గర్నుంచి ఇంతవరకు వెలబడలేదు. ఈ సినిమా అప్డేట్ కోసం బన్నీ అభిమానులు ఆందోళన నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.