బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. ఈ సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా మలయాళీ బ్యూటీ హనీ రోజ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ పాత్రలో నటించి సినిమా హిట్ అవ్వటానికి కారణం అయ్యింది. తెలుగు, తమిళ్ సినిమాలలో నెగిటివ్ పాత్రలలో నటిస్తూ లేడీ విలన్ గా గుర్తింపు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ వీరసింహారెడ్డి సినిమాలో భాను అనే ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకు ఎంత గుర్తింపు దక్కిందో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు కూడా సమానమైన గుర్తింపు లభించింది. ఈ సినిమాలో వరలక్ష్మీ నటనకు ప్రేక్షకులు థియేటర్లలో విజిల్స్ వేస్తూ సందడి చేశారు. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ కథ రాసినప్పుడు ఈ పాత్ర కోసం మొదట వరలక్ష్మి శరత్ కుమార్ ని కాకుండా మరొక హీరోయిన్ ని పెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో ఈ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించినట్లు సమాచారం. బాలయ్య సినిమాలో నటించే అవకాశం వదులుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటిస్తే ప్రేక్షకులు మరింత కనెక్ట్ అవుతారని దర్శకుడు భావించాడు. అంతేకాకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని దర్శకుడు భావించాడు. ఈ మేరకు కీర్తి సురేష్ ని సంప్రదించగా.. సాఫ్ట్ క్యారెక్టర్ అయితే తాను సెట్ అవుతానని ఇలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కి తాను సూట్ అవ్వనని చెప్పి ఈ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం.