టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారిలో సమంత ఒకరు. ఈమె వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం పూర్తి అయినప్పటికీ ఈమె ఎంతో ఫిట్ గా ఉండి వరుస అవకాశాలను అందుకని దూసుకుపోతున్నారు. అయితే ఈమె ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అంటూ ఎంతో మంది అభిమానులు ప్రశ్నించారు. మరి సమంత ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం…
సమంత తన ఫిట్నెస్ మెయింటెన్ చేయడం కోసం ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఏ మాత్రం సమయం దొరికినా జిమ్ములో గడుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. సమంత జిమ్ కి వెళ్లడానికి ముందు వర్కౌట్స్ చేస్తారట. జిమ్ తర్వాత సమంత పూర్తిగా శాకాహారమే అయిన ప్రొటీన్ షేక్ తీసుకుంటారు. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం కోసం ఎక్కువగా నీళ్ళు తీసుకుంటారు.
ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా సమంత ఎగ్ అవకాడో వంటి వాటిని తీసుకుంటారు. ఇక మధ్యాహ్న భోజనంలో భారతీయ వంటకాలు ఎక్కువగా కూరగాయలు, చేపలు లేదా మాంసం తీసుకుంటారట అలాగే రాత్రి ఆయిల్ లేకుండా రోటి తీసుకోవడం అలవాటు. ఇలా ఫుడ్ తీసుకుంటూ జిమ్ లో ఎక్కువ వర్క్ అవుట్ చేస్తూ సమంత తన ఫిట్నెస్ కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకవేళ జిమ్ చేయని పక్షంలో వాకింగ్ వెళ్తారట.